Tue Mar 24 2026 12:43:43 GMT+0530 (India Standard Time)
నేడు పట్టువస్త్రాలను సమర్పించనున్న జగన్
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల వెళ్లనన్నారు. మధ్యాహ్నం బయలుదేరి తిరుపతి చేరుకుంటారు

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల వెళ్లనన్నారు. మధ్యాహ్నం బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. తిరుపతి అలిపిరి సమీపంలో ఆయన ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరుమలకు చేరుకుంటారు. స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం పెద శేష వాహన సేవలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
రాత్రికి అక్కడే బస...
అనంతరం రాత్రికి పద్మావతి అతిధి గృహంలో బస చేస్తారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకుంటారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో పూర్తి భద్రత కల్పించినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పది హేను వందల మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. రాత్రికి తిరుమలలో బస చేసి రేపు తిరిగి జగన్ విజయవాడ చేరుకుంటారు.
Next Story

