Mon Mar 16 2026 23:45:28 GMT+0530 (India Standard Time)
నేడు ప్రధానితో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఆయన ప్రధానిని కలవనున్నారు. నిన్న ఢిల్లీ చేరుకున్న జగన్ జన్పథ్ ఒకటిలో రాత్రి బస చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ 11 గంటలకు దొరికినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
రాష్ట్ర అభివృద్ధికి...
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చర్చించనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నారని తెలిసింది. పోలవరం ప్రాజెక్టు నిధులు, పెిండింగ్ ప్రాజెక్టులపై ఆయన చర్చించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
Next Story

