Thu Sep 21 2023 15:46:45 GMT+0000 (Coordinated Universal Time)
మోదీతో నేడు జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన 1 జనపథ్ లో బస చేశారు. ఈరోజు ఉదయం 10.30 గటలకు మోదీని జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై జగన్ చర్చించనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల సమస్య, పెండింగ్ నిధుల విడుదలపై ఆయన ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర సాయాన్ని ఈ సందర్భంగా జగన్ కోరనున్నారు.
రాష్ట్రపతిని...
అలాగే విభజన చట్టంలోని హామీల అమలుపైనా మోదీతో చర్చించనున్నారు. ఈ మేరకు నరేంద్రమోదీకి వినతి పత్రాన్ని అంద చేయనున్నారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ లను కలుస్తారు. అనంతరం కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ను కలిసి అభినందనలు తెలియజేయనున్నారు. వీలును బట్టి మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు తెలిపాయి.
Next Story