Thu Mar 19 2026 09:27:38 GMT+0530 (India Standard Time)
Ys Jagan : శారదాపీఠానికి వెళ్లనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 21న విశాఖపట్నం బయలుదేరి వెళ్లనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 21న విశాఖపట్నం బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ శారదాపీఠానికి వెళ్లనున్నారు. చినముష్టివాడలోని శారదాపీఠానికి వెళ్లి అక్కకడ పీఠంలో ఉన్న రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 21వ తేదీ ఉదయం పది గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ విశాఖకు బయలుదేరి వెళతారు.
21న ఉదయం బయలుదేరి...
విశాఖలోని శారదాపీఠానికి వెళతారు. రాజశ్యామల వారి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన తిరిగి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల సమయంలో జగన్ రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తుంది.
Next Story

