Thu Mar 19 2026 15:56:43 GMT+0530 (India Standard Time)
నేడు కడప జిల్లాలో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు కడప జిల్లాకు బయలుదేరనున్నారు. ఆయన రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు కడప జిల్లాకు బయలుదేరనున్నారు. ఆయన రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. పులివెందుల, వేంపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరి వెళతారు. 10.50 గంటలకు పులివెందులు చేరుకుంటారు. అక్కడ ఆర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెదులలోని న్యూటెక్ బయో సైన్సెస్ కు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుంచి వేంపల్లె వచ్చి వైఎస్సార్ స్మారక పార్క్ ను ప్రారంభిస్తారు.
వివిధ కార్యక్రమాల్లో...
సాయంత్రం 4 గంటలకు వేంపల్లె జిల్లా పరిషత్ హైస్కూలు భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి ఇడుపులపాయ చేరుకుని అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. తిరిగి అక్కడి నుంచి తాడేపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న వైసీపీ ప్లీనరీలో పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story

