Wed Mar 25 2026 19:26:28 GMT+0530 (India Standard Time)
నేడు హస్తినకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళతారు. రెండు గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.
నిధుల సమీకరణ కోసమే...
నెలాఖరు కావడంతో నిధుల సమీకరణ కోసం నిధులు వెళుతున్నారని సమాచారం. కార్పొరేషన్ల నుంచి అప్పులు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందేందుకు ప్రత్యేకంగా జగన్ వెళుతున్నట్లు తెలిసింది. నెలాఖరు కానుండటంతో జగన్ కేవలం నిధుల కోసమే ఢిల్లీకి వెళుతున్నారని తెలిసింది. మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో పాటు మరికొందరిని కలిసే అవకాశముంది.
Next Story

