Sat Dec 06 2025 00:21:12 GMT+0000 (Coordinated Universal Time)
ఆ జిల్లాల కలెక్టర్లతో కాసేపట్లో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు జిల్లా కలెక్టర్లతో సమీక్షను నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు జిల్లా కలెక్టర్లతో సమీక్షను నిర్వహించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో జగన్ మాట్లాడనున్నారు. మరో అల్పపీడనంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
ముందు జాగ్రత్త చర్యలు....
దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆ నాలుగు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. భారీ వర్షాల కారణంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, సహాయ శిబిరాల ఏర్పాటు, ప్రాజెక్టుల నిర్వహణ తదితర అంశాలపై జగన్ కలెక్టర్లతో చర్చించనున్నారు.
Next Story

