Sat Mar 07 2026 18:02:43 GMT+0530 (India Standard Time)
జగన్ నేడు సిక్కోలు వయా హైదరాబాద్ టు ఢిల్లీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన ఆముదాల వలసకు చేరుకుంటారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన ఆముదాల వలసకు చేరుకుంటారు. అక్కడ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. ఇందుకోసం అధికారులు శ్రీకాకుళం జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకుని శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ నార్సింగ్ లో జరిగే జీవీ ప్రతాప్ రెడ్డి కుమారుడి వేడుకలకు హాజరవుతారు.
రేపు ఢిల్లీలో...
రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ వెళతారు. అక్కడ రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశం అనంతరం తిరిగి జగన్ తాడేపల్లి తిరిగి బయలు దేరి వస్తారు.
Next Story

