Sun Mar 15 2026 07:56:59 GMT+0530 (India Standard Time)
Ys Jagan : జగన్ విదేశాలకు ఎన్నికలు అయిపోయిన వెంటనే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే విదేశాలకు వెళ్లనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే విదేశాలకు వెళ్లనున్నారు. కుటుంబంతో కలసి ఆయన విదేశాలకు వెళ్లనున్నారని తెలిసంది. మే 15న లండన్‌కు జగన్ దంపతులు బయలుదేరి వెళుతున్నట్లు సమాచారం. అనుమతి కోసం నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. ఈనెల 15 నుంచి 30 వరకు లండన్, అమెరికాలో జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పదిహేను రోజుల పాటు...
దాదాపు పదిహేను రోజులు విదేశాల్లో ఉంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా గతంలో ఎన్నికలు పూర్తయిన వెంటనే ఫ్యామిలీతో వెళ్లి అలా గడిపి రావడం అలవాటు. అదే అలవాటును ముఖ్యమంత్రి జగన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. 2014, 2019 పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ విదేశాలకు వెళ్లి వచ్చారు. పోలింగ్ ఈ నెల 13వ తేదీన పూర్తయిన వెంటనే ఆయన తన సతీమణితో కలసి తొలుత లండన్ కు తర్వాత అమెరికాకు వెళ్లి గడిపి వస్తారని చెబుతున్నారు.
Next Story

