Mon Mar 30 2026 18:32:09 GMT+0530 (India Standard Time)
వారం రోజులు ఎంజాయ్
ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి వైఎస్ జగన్ ఈ ఏడాది కూడా సమ్మర్ టూర్కు విదేశాలకకు వెళ్లనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి వైఎస్ జగన్ ఈ ఏడాది కూడా సమ్మర్ టూర్కు విదేశాలకకు వెళ్లనున్నారు. ప్రతి ఏడాది కుటుంబ సభ్యులతో జగన్ వేసవి సెలవుల్లో గడుపుతారు. హాలిడే ట్రిప్ వేయనున్నారు. క్షణం తీరిక లేకుండా ఉండే సమయంలోనూ కుటుంబ సభ్యుల కోసం ఏడాదికి కొంత సమయాన్ని కేటాయించడం జగన్ కు అలవాటు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ అంతే. కేవలం పాదయాత్రలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన టూర్కు వెళ్లలేదు. మిగిలిన ప్రతి ఏడాది వేసవికి టూర్కు వెళ్లడం జగన్ ఒక అలవాటుగా మార్చుకున్నారు. ఈ ఏడాది కూడా జగన్ విదేశాలకు వేసవి సెలవుల్లో కడిపేందుకు బయలుదేరి వెళతారు.
ఈ నెల 21 నుంచి...
ఈ నెల 21వ తేదీ నుంచి వారం లేదా పది రోజుల పాటు ఆయన విదేశాల్లో కుటుంబ సభ్యులతో గడపనున్నారు. ఆయన భార్య భారతి, కుమార్తె హర్ష రెడ్డి, వర్షారెడ్డిలతో కలసి వారం రోజుల పాటు ఈ సారి కూడా విదేశాల్లో పర్యటించనున్నారని తెలిసింది. గత ఏడాది స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడి నుంచి లండన్ కు కూడా వెళ్లి వచ్చారు. కాస్త సేదతీరడం కోసం, ఉపశమనం నిమిత్తం జగన్ ఏడాదికొకసారి ఇలా విదేశీ పర్యటనలు చేస్తుంటారు. అయితే ఇది వ్యక్తిగత పర్యటన కావడంతో ఇంకా ఏ దేశానికి ఆయన వెళ్లనున్నారన్నది తెలియరాలేదు. కొద్ది రోజుల్లోనే ప్రకటించే అవకాశముంది.
Next Story

