Tue Mar 31 2026 21:58:07 GMT+0530 (India Standard Time)
నేడు రైతుల ఖాతాల్లోకి 199 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రైతుల ఖాతాలలో నగదును జమ చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రైతుల ఖాతాలలో నగదును జమ చేయనున్నారు. రబీ 2020-21 ఖరీఫ్ సీజన్ కు చెందిన సున్నా వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 199.94 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో బటన్ నొక్కి జగన్ వేయనున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీలతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు జరగని వారికి కూడా నేడు చెల్లిస్తారు.
బటన్ నొక్కి...
తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈరోజు బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో 199 కోట్ల రూపాయల నగదును జగన్ జమ చేయనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. రబీ సీజన్ లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి, 2021లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి ఈ నిధులు దక్కనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

