Mon Mar 16 2026 19:49:06 GMT+0530 (India Standard Time)
Ys Jagan : వచ్చే నెల10న విశాఖకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిబ్రవరి పదోతేదీన విశాఖకు రానున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫిబ్రవరి పదోతేదీన విశాఖకు రానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ప్రకటించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముగింపు సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమాలను విశాఖలో నిర్వహిస్తున్నారు.
ముగింపు వేడుకలకు...
ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో విజేతలకు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా బహుమతులను అందచేయనున్నారు. పెద్దయెత్తున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ముగింపు కూడా అదిరిపోయేలా ఉండాలని వైఎస్ జగన్ ను ఆహ్వానించడంతో ఆయన అంగీకరించారు.
Next Story

