Mon Mar 30 2026 21:52:22 GMT+0530 (India Standard Time)
ఈరోజు ప్రకాశం జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాకు రానున్నారు. కారుమంచి లో సీఎం జగన్ పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాకు రానున్నారు. కారుమంచి లో సీఎం జగన్ పర్యటించనున్నారు. కొండెపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ వరికూటి అశోక్బాబు నివాసంలో ఆయన తల్లి కోటమ్మ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 11.15 గంటలకు జగన్ ప్రకాశం జిల్లాకు బయలుదేరి వెళతారు.
భారీ బందోబస్తు...
ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎటువంటి పార్టీ కార్యక్రమాలు లేకపోయినప్పటికీ నేతలందరూ ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుండటంతో ప్రకాశం జిల్లా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వరికూటి అశోక్ బాబును పరామర్శించిన అనంతరం తిరిగి తాడేపల్లి బయలుదేరి వస్తారు.
Next Story

