Wed Apr 01 2026 01:42:24 GMT+0530 (India Standard Time)
రేపు హైదరాబాద్ కు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పార్ధీవ దేహానికి నివాళులర్పించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. హైదరాబాద్ లో సూపర్ స్టార్ కృష్ణ పార్ధీవ దేహానికి నివాళులర్పించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరుపున ప్రత్యేకంగా జగన్ హైదరాబాద్ కు వచ్చి కృష్ణ పార్ధీవ దేహానికి నివాళులర్పించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలపనుంది.
రేపు అంత్యక్రియలకు....
రేపు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. కృష్ణ పార్ధీవదేహాన్ని అభిమానులు చూడటం కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం కృష్ణ అంత్యక్రియలు మహా ప్రస్థానంలో జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంటున్నారు.
Next Story

