Mon Mar 23 2026 09:07:52 GMT+0530 (India Standard Time)
Ys Jagan : రేపు కేసీఆర్ వద్దకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు హైదరాబాద్కు రానున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్కు రానున్నారు. ఆయన నేరుగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలవనున్నారు. ఇటీవల కేసీఆర్ తన ఫామ్ హౌస్లో కాలు జారి పడి తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేయించుకుని తననివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన ఇంటికే పరిమితయ్యారు.
పరామర్శించేందుకు...
అయితే కేసీఆర్ను పరామర్శించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా హైదరాబాద్కు రానుండటం విశేషం. కేసీఆర్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు రావాలనుకున్న జగన్ కొన్ని కారణాల వల్ల పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో రేపు జగన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను పరామర్శించడానికి వస్తున్నారు. ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు కూడా జరిగే అవకాశముంది.
Next Story

