Mon Mar 23 2026 09:07:52 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు హైదరాబాద్కు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ రానున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ పరామర్శించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ రానున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ పరామర్శించనున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా జగన్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళతారు.
అక్కడే భోజనం చేసి...
అక్కడ కేసీఆర్ ను పరామర్శిస్తారు. ఇటీవల తుంటి మార్పిడి చికిత్స చేయించుకుని కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శిస్తారు. అక్కడే భోజనం చేస్తారు. వారిద్దరూ తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశముంది. అనంతరం నేరుగా అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story

