Mon Mar 16 2026 06:03:08 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో హైదరాబాద్ కు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. నేరుగా పద్మాలయా స్టూడియోకు జగన్ వెళ్లి అక్కడ సూపర్ స్టార్ కృష్ణ పార్ధీవ దేహానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనన్న జగన్ 11గంటల ప్రాంతంలో పద్మాలయా స్టూడియోకు చేరుకుంటారు. అనంతరం అక్కడ మహేష్ బాబు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.
కృష్ణ కుటుంబ సభ్యులకు...
జగన్ వస్తుండటంతో కాసేపు పద్మాలయా స్టూడియోలో అభిమానుల సందర్శన కొద్దిసేపు నిలిపి వేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం కృష్ణ పార్ధీవ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మహాప్రస్థానంలోని కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.
Next Story

