Sun Mar 26 2023 09:35:43 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 27న హైదరాబాద్ కు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఒక వివాహవేడుకలో పాల్గొననున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఒక వివాహవేడుకలో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 27వ తేదీ ఉదయం బయలుదేరి ఆయన హైదరాబాద్ చేరుకుని వివాహ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు.
చింతల కుమారుడు వివాహం...
ఈ నెల 27వ తేదీన పీలేరు శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి కుమారుడి వివాహం జరగనుంది. ఆ వివాహానికి జగన్ హాజరు కానున్నారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం జగన్ తిరిగి తాడేపల్లి బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story