Thu Mar 19 2026 09:47:24 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ ను కలవనున్న ఉద్యోగ సంఘాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను నేడు ఉద్యోగ సంఘాల నేతలు కలవనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను నేడు ఉద్యోగ సంఘాల నేతలు కలవనున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించిన నేపథ్యంలో జగన్ ను కలసి కృతజ్ఞతలు తెలపాలని భావించారు. నిన్న ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు సఫలమయిన సంగతి తెలిసిందే. సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈరోజు అర్థరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాల్సిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేర్చడంతో విరమించుకున్నారు.
సమ్మె విరమణతో...
నిన్న ఉద్యోగ సంఘ నేతలో జగన్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరస్థితి దృష్ట్యా అనుకున్న స్థాయిలో ఫిట్ మెంట్ ను ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. ఉద్యోగ సంఘాలు కూడా చర్చలు జరిగిన తీరు, తమ డిమాండ్ల పరిష్కారానికి లభించిన హామీ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ను కలసి ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలపనున్నాయి.
Next Story

