Fri Apr 03 2026 12:23:15 GMT+0530 (India Standard Time)
ఎల్లుండి జగన్ హైదరాబాద్ రాక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 7 వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 7 వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో జగన్ పాల్గొంటారు. చిన జీయర్ స్వామి స్వయంగా అమరావతి వెళ్లి జగన్ ను ఆహ్వానించి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈ నెల 7వ తేదీన ముచ్చింతల్ కు రానున్నారు.
వరస పర్యటనలతో....
అలాగే ఈనెల 9వ తేదీన జగన్ విశాఖపట్నం పర్యటనకు వెళతారు. అక్కడి శ్రీ శారదాపీఠంలో జరిగే కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. శారదా పీఠం వార్షికోత్సం జరగనుంది. ఈ నెల 11వ తేదీన తిరిగి జగన్ హైదరాబాద్ కు వస్తారు. హైదరాబాద్ లో జరగనున్న మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకల్లో జగన్ పాల్గొంటారు.
Next Story

