Wed Mar 25 2026 20:52:48 GMT+0530 (India Standard Time)
నేడు ప్రధానితో జగన్ భేటీ
ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రధాని మోదీని కలవనున్నారు

ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రధాని మోదీని కలవనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన ప్రధానితో సమావేశం అవనున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై జగన్ ప్రధాని మోదీతో చర్చించనున్నారు. విభజన హామీలను అమలుచేయాలని కూడా కోరనున్నారు.
పోలవరం నిధులపై....
ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమై పోలవరం ప్రాజెక్టు నిధులను విడుదల చేయాలని జగన్ కోరనున్నారు. శీతాకాలం ముగిసే లోపు పనులను సాధ్యమయినంత వరకూ పూర్తి చేయాలన్న భావనతో జగన్ ప్రధాని మోదీని ఈ విషయంపై ప్రత్యేకంగా అభ్యర్థించనున్నారు. రాష్ట్ర సమస్యలకు సంబంధించి వినతి పత్రాన్ని అందచేయనున్నారు.
Next Story

