Sat Mar 07 2026 23:58:09 GMT+0530 (India Standard Time)
జగన్ పై మాజీ జేడీ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తలతో ముంచెత్తారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ పాలనపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. జగన్ ప్రభుత్వంలో నాడు - నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ఆయన ప్రశంసించారు.
విద్య వైద్య రంగాల్లో...
విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన వారికి మంచి ఫలితం ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. సాధారణంగా ఆరోగ్య పరీక్షల కోసం ఒకరోజు క్యాంప్ పెట్టి ఒకరోజు ముగిస్తారన్నారు. కానీ తొమ్మిదివేలను పరిశీలించి ఆరోగ్య సురక్ష క్యాంప్ లో ఇక్కడకు పిలిచి ఏదైనా ఇబ్బందులుంటే వాటిని గుర్తించి పరిష్కారం కనుగొని, మందులు ఇవ్వడం మంచి పరిణామమని ఆయన తెలిపారు.
Next Story

