Sat Mar 07 2026 22:21:11 GMT+0530 (India Standard Time)
జగన్ ను కలిసిన జేఏసీ నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పీఆర్సీ సాధన సమితి నేతలు కలిశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పీఆర్సీ సాధన సమితి నేతలు కలిశారు. తమ డిమాండ్లను అంగీకరించినందుకు వారు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా హెచ్ఆర్ఏ శ్లాబుల వర్గీకరణ, రికవరీ అంశం లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు జగన్ ను కలసి కృతజ్ఞతలు తెలిపాయి. రెండు రోజుల పాటు మంత్రుల కమిటీతో చర్చించి ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను దాదాపుగా నెరవేర్చుకున్నాయి.
ఆర్థిక పరిస్థితి దృష్ట్యా.....
అయితే తమ డిమాండ్లను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు అపాయింట్ మెంట్ కోరాయి ఉద్యోగ సంఘాలు. కొద్ది సేపటి క్రితం జగన్ ను కలిసి ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్థిక పరిస్థిితి కారణంగా అనుకున్నంత ఫిట్ మెంట్ ఇవ్వలేకపోయామని జగన్ ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నేతలతో అన్నట్లు తెలిసింది. కాగా ఉద్యోగ సంఘాల జేఏసీ నుంచి ఉపాధ్యాయ సంఘాలు వేరుపడ్డాయి.
Next Story

