Tue Mar 10 2026 07:05:22 GMT+0530 (India Standard Time)
అందుకోసమే జగన్ ను కలిశా
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సినీ రచయిత పోసాని కృష్ణమురళి కలిశారు

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సినీ రచయిత పోసాని కృష్ణమురళి కలిశారు. ఈరోజు జగన్ ను కలసిన పోసాని కృష్ణమురళి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబం మొత్తం కరోనా బారిన పడి చికిత్స పొందుతుంటే జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డి సాయం చేశారని పోసాని తెలిపారు. ఆసుపత్రికి ఫోన్ చేసి మరీ సరైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారని పోసాని కృష్ణమురళి తెలిపారు.
టిక్కెట్ల ధరలపై...
సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అందుకే భీమ్లా నాయక్ కు ప్రస్తుతం ఉన్న ధరలనే ప్రభుత్వం అమలు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఇతర విషయాలేమీ జగన్ తో చర్చించలేదని చెప్పారు. భీమ్లా నాయక్ సినిమాను ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఇబ్బంది పెట్టిందన్న ఆరోపణలు సరికావని పోసాని కృష్ణమురళి అన్నారు.
Next Story

