Thu Jan 29 2026 16:44:42 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు వేద ఆశీర్వచనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్ ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. విశాఖపట్నంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా జగన్ ను వారు ఆహ్వానించారు.
ఆహ్వానం....
ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. తీర్థ ప్రసాదాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.
Next Story

