Tue Mar 24 2026 11:13:27 GMT+0530 (India Standard Time)
శ్రీవారిని దర్శించుకున్న జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు వేదపండితులు స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన జగన్ ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణలు ఉన్నారు.
నూతన పరకామణిని...
రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి జగన్ కు అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. తీర్థ ప్రసాదాలను అందచేశారు. అనంతరం నూతన పరకామణిని జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత నూతన అతిధి గృహాన్ని కూడా జగన్ ప్రారంభించారు. మరికొద్దిసేపట్లో జగన్ తిరుమల నుంచి బయలు దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.
Next Story

