Sat Apr 04 2026 18:31:29 GMT+0530 (India Standard Time)
నేడు వారి ఖాతాల్లో నగదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తారు. గులాబ్ తుపాను కారణంగా నష్టపోయిన 34,586 మంది రైతులకు ఈ పరిహారం అందనుంది. వీరికి 22 కోట్ల రూపాయల పరిహారాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు జగన్.
ఏ సీజన్ లో నష్టం జరిగితే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఏ సీజన్ లో జరిగిన నష్టానికి ఆ సీజన్ లోనే పరిహారం అందించాలని నిర్ణయించారు. ఈమేరకు పంట నష్టం జరిగిన వెంటనే లెక్కలు కట్టి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తున్నారు. కరోనా సమయంలోనూ జగన్ పథకాల అమలును నిలిపి వేయలేదు.
Next Story

