Tue Mar 17 2026 02:12:54 GMT+0530 (India Standard Time)
ఎల్లుండి విశాఖకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లుండి విశాఖ జిల్లా పర్యటనకు రానున్నారు

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎల్లుండి విశాఖ జిల్లా పర్యటనకు రానున్నారు. 2022 యుద్ధ నౌకల సమాహారంలో భాగంగా ఈ నెల 27న ఇంటర్నేషనల్ సిటీ పరడే జరగనుంది. ఈ కార్యక్రమానికి జగన్ హాజరుకానున్నారు. 27 వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నావల్ డాక్ యార్డుకు బయలుదేరి వెళతారు.
వివిధ కార్యక్రమాలలో...
అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఐఎన్ఎస్ సబ్ మెరీన్ ను సందర్శిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు ఆర్కే బీచ్ కు చేరుకుని ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలాన్ లో ముఖ్యఅతిధిగా పాల్గొని జగన్ ప్రసంగిస్తారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత రాత్రి 7.30 గంటల ప్రాంతంలో బయలుదేరి తిరిగి తాడేపల్లికి జగన్ చేరుకుంటారు.
Next Story

