Fri Apr 03 2026 22:19:43 GMT+0530 (India Standard Time)
నేడు రైతుల ఖాతాల్లో నగదు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత నిధులను నేడు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదను జమ చేస్తారు. ఈ విడత 1,036 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు.
మూడో విడత....
ఈ పథకం కింద నేడు 50,58,489 మంది రైతులు లబ్ది పొందనున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ప్రతి ఏటా మూడు విడతల్లో ఈ పథకం కింద 13,500 రూపాయలు రైతులకు ప్రభుత్వం అందించనుంది.
Next Story

