Fri Mar 20 2026 21:56:59 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో జగన్ ఉండగానే ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో ఉండగానే పార్టీ కార్యక్రమం గురించి ఆలోచించి ఆదేశాలు జారీ చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో ఉండగానే పార్టీ కార్యక్రమం గురించి ఆలోచించి ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 3వ తేదీన ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు, రీజనల్ కో- ఆర్డినేటర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు. వెంటనే ఢిల్లీ టూర్లో ఉన్న జగన్ అక్కడి నుంచే పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించారు
ఏప్రిల్ 3న...
ఏప్రియల్ 3వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ఈ సమావేశం జరగనుంది. గడప,గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

