Wed Apr 01 2026 01:44:03 GMT+0530 (India Standard Time)
ఎన్నికలతో సంబంధం లేకుండానే అభివృద్ధి
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నెల్లూరు జిల్లా నేలటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ జెన్ కో మూడో యూనిట్ ను జగన్ జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంత మత్స్యకారులకు 25 కోట్ల రూపాయలతో జెట్టీ ఏర్పాటు చేస్తున్నామని జగన్ ప్రకటించారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అడిగిన హైలెవెల్ వంతెనను మంజూరు చేస్తున్నట్లు జగన్ తెలిపారు.
చంద్రబాబు తప్పుడు హామీలు...
గతంలో ఓట్ల కోసం చంద్రబాబు తప్పుడు హామీ లిచ్చారని విమర్శించారు. ధర్మల్ పవర్ స్టేషన్ కు భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని జగన్ తెలిపారు. ప్రజలందరికీ మంచి చేయాలన్నదే ఈ ప్రభుత్వం ఉద్దేశ్యమని ఆయన అన్నారు. 16,218 మంది మత్స్యాకారేతర కుటుంబాలకు 35.74 కోట్ల రూపాయల సాయం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. వైఎస్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును ప్రారంభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో తాను చేస్తానని చెప్పింది చేయడానికి వచ్చానని ఆయన అన్నారు.
Next Story

