Wed Mar 18 2026 19:41:59 GMT+0530 (India Standard Time)
పోలీసుల పని భారం తగ్గిస్తాం
పోలీసుల పనిభారాన్ని తగ్గించేందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు

పోలీసుల పనిభారాన్ని తగ్గించేందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో జగన్ పాల్గొని ప్రసంగించారు. హోంగార్డుల జీతాలను పెంచుతున్నామని ప్రకటించారు. 6,511 మంది పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని జగన్ తెలిపారు.
పోలీసు కష్టాలను తెలిసిన...
పోలీసు కష్టనష్టాలు తెలిసిన ప్రభుత్వం తమది అని జగన్ అన్నారు. అమరవీరువల కుటుంబాలకు అండగా నిలుస్తామని జగన్ తెలిపారు. నేటి నుంచి పోలీసుల శాఖలో పకడ్బందీగా వీక్లీ ఆఫ్ అమలు చేయాలని ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు. పోలీసు శాఖకు వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు లభించిందన్నారు. గతంలో పోలిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. అందుకు పోలీసుల శాఖ చేస్తున్న కృషి నిదర్శనమని ఆయన తెలిపారు.
Next Story

