Tue Jun 06 2023 13:41:53 GMT+0000 (Coordinated Universal Time)
అలర్ట్గా ఉండండి.. అధికారులకు ఆదేశం
రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్ అధికారులతో సమీక్షించారు.

రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్ అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్ మొదలుపెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వారంరోజుల్లో ఈ ఎన్యుమరేషన్ పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్లుకు ఆదేశాలు జారీచేయాలన్నారు.
అప్రమత్తంగా ఉండాలని...
ఎన్యుమరేషన్ పూర్తయిన తర్వాత రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. భారీవర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.
Next Story