Tue Jan 20 2026 11:39:52 GMT+0000 (Coordinated Universal Time)
అప్రమత్తంగా ఉండండి : జగన్ ఆదేశం
మండూస్ తుపాను పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాని ఆయన ఆదేశించారు

మండూస్ తుపాను పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాని ఆయన ఆదేశించారు. మాండూస్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టుల వద్ద...
లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని జగన్ అధికారులను ఆదేశించారు. చెరువులు, ప్రాజెక్టుల వద్ద భద్రతను మరింత పెంచాలని ఆయన కోరారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు.
Next Story

