Sun Sep 24 2023 10:49:16 GMT+0000 (Coordinated Universal Time)
నుదుటున తిలకం.. పట్టుపంచెతో
ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు చేరుకున్నారు. ఆయన తొలుత బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమలకు చేరుకున్నారు. ఆయన తొలుత బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు జగన్కు పరివట్టం కట్టారు. ఆ తర్వాత శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలను సమర్పించడానికి బయలుదేరి వెళ్లారు. శ్రీవారికి పట్టువస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరుపున జగన్ సమర్పించనున్నారు. సంప్రదాయ బద్ధంగా పట్టు పంచె కట్టుకుని ఆయన తిరుమలలో కన్పించారు. అర్చకులు జగన్ నుదుటన తిలకం దిద్దారు.
శ్రీవారికి పట్టువస్త్రాలు...
రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జగన్ స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. జగన్ వెంట టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు టీటీడీకి చెందిన ఉన్నతాధికారులు నడిచారు. ఈ రాత్రికి జగన్ తిరుమలలోనే బస చేయనున్నారు. అనంతరం రేపు ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత తిరుమల నుంచి నేరుగా కర్నూలు జిల్లాకు జగన్ బయలు దేరి వెళతారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జగన్ తిరుమలకు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
Next Story