Mon Mar 16 2026 09:38:47 GMT+0530 (India Standard Time)
కైకాలకు సీఎం జగన్ ఫోన్
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్ చేశారు

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అపోలో ఆసుపత్రి వైద్యులతోనూ జగన్ మాట్లాడారు. సత్యనారాయణకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను అందజేయాలని జగన్ కోరారు. కైకాల సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు.
అపోలో ఆసుపత్రిలో....
కైకాల సత్యనారాయణ పోస్ట్ కోవిడ్ సమస్యలతో అపోలో ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం చేరారు. అయితే ఆయన కోలుకుంటున్నారని ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో అపోలో ఆసుపత్రి పేర్కొంది. త్వరగా కైకాల సత్యనారాయణ కోలుకోవాలని టాలివుడ్ కోరుకుంటుంది.
Next Story

