Tue Mar 17 2026 20:19:16 GMT+0530 (India Standard Time)
ప్రధాని మోదీకి జగన్ లేఖ
ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు

ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. వరద సాయం కింద తక్షణమే వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని జగన్ కోరారు. వరద నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కు పంపాలని జగన్ కోరారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా జగన్ లేఖ రాశారు.
భారీ నష్టం....
గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ నష్టం జరిగింది. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పక్కా ఇళ్లు సయితం వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఏపీని ఆదుకోవాలని జగన్ తన లేఖలో ప్రధాని మోదీని కోరారు.
Next Story

