Mon Mar 16 2026 07:51:00 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు శ్రీకాకుళానికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయనచంచిలి మండలం మకారంపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ప్రజల నుంచి కొద్ది సేపు వినతులను స్వీకరిస్తారు. తర్వాత 11.10 గంటలకు వైఎస్సార్ సుజలధార పంప్ హౌస్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి నేరుగా పలాసకు ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు.
పలాసలో...
పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఇండ్రస్ట్రియల్ కారిడార్ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు.ఆ తర్వా పలాస లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసగించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి కార్యాలయానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Next Story

