Thu Mar 19 2026 02:59:19 GMT+0530 (India Standard Time)
నేడు సిక్కోలుకు జగన్ .. "అమ్మఒడి" విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు కోడిరామ్మూర్తి స్టేడియంకు చేరుకుని బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అమ్మఒడి పథకం లబ్దిదారులతో జగన్ మాట్లాడతారు. తర్వాత బహిరంగ సభలో జగన్ మాట్లాడతారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
43.96 లక్షల మంది...
శ్రీకాకుళంలో అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్దిదారుల ఖాతాల్లో నిధులను జగన్ జమ చేస్తారు. మొత్తం 6,594.6 కోట్ల రూపాయలను బటన్ నొక్కి అమ్మఒడి పథకం కింద లబ్దిదారులకు విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా 43.96 లక్షల మంది లబ్ది పొందనున్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు జగన్ రానుండటంతో నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

