Thu Mar 19 2026 18:43:07 GMT+0530 (India Standard Time)
నేడు రాజమండ్రికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రాజమండ్రి జిల్లాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు రాజమండ్రి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పింఛనుదారుల ముఖాముఖిలో జగన్ పాల్గొననున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు జగన్ రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్ కు చేరుకుంటారు. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయన కొద్దిసేపు మాట్లాడతారు. అనంతరం రోడ్ షో ద్వార ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారు.
లబ్దిదారులతో మాట్లాడి...
బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ న జగన్ పరిశీలిస్తారు. లబ్దిదారులతో మాట్లాడతారు. ఈ నెల నుంచే ఏపీలో పెన్షన్ల మొత్తాన్ని 2,750 రూపాయలకు పెంచింది. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. బహిరంగ పూర్తయిన అనంతరం తిరిగి ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. జగన్ పర్యటనకు సంబంధించి అధికారులు రాజమండ్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

