Sun Mar 15 2026 00:35:26 GMT+0530 (India Standard Time)
రేపు నెల్లూరుకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో జగన్ పాల్గొననున్నారు. తొలుత ముఖ్యమంత్రి రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నెల్లూరుకు చేరుకుంటారు.
మేకపాటి సంస్మరణ సభలో....
పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా నాయకులతో జగన్ సమావేశం కానున్నారు. ప్రధానంగా మంత్రి వర్గ విస్తరణ, జిల్లా అభివృధ్ది పనులపై జగన్ చర్చించనున్నట్లు తెలిసింది. అనంతరం దివంగత మేకపాటి సంస్మరణ సభలో పాల్గొంటారు. నెల్లూరులోనీ వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న గౌతమ్ రెడ్డి సంస్మరణ సభకు జగన్ హాజరుకానుండటంతో పెద్దయెత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచే నెల్లూరులో ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నారు.
Next Story

