Sat Apr 04 2026 16:52:39 GMT+0530 (India Standard Time)
జగన్ నేడు ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ఆయన వరద పరిస్థితులను సమీక్షించనున్నారు. చిత్తూరు. నెల్లూరు, కడప జిల్లాల్లో జగన్ పర్యటిస్తారు. జగన్ వెంట హోంమంత్రి సుచరిత కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా జిల్లాలను పర్యటిస్తారు.
మూడు జిల్లాల్లో....
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా పెద్దయెత్తున జరిగింది. జగన్ కడప నుంచి జిల్లాలను పర్యటించి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
Next Story

