Fri Dec 05 2025 20:23:19 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎమ్మెల్యేలతో జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అవుతున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అవుతున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు. గత నెలలో ఒకసారి ఈ వర్క్ షాప్ జరిగింది. మరోసారి ఈ వర్క్ షాప్ ను నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు హాజరు కానున్నారు.
గడప గడపకు ప్రభుత్వం....
ఈ ఏడాది ఏప్రిల్ నెల 11వ తేదీన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఇంటింటికీ వివరించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తుండగా, మరికొందరు కార్యక్రమాన్ని చేయడం లేదు. తమ అనుచరులతో చేయించి మమ అనిపిస్తున్నారు. దీనిపై జగన్ ఈరోజు ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో క్లాస్ పీకే అవకాశముంది.
Next Story

