Wed Aug 10 2022 00:04:28 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పారిస్ కు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విదేశాలకు పయనమవుతున్నారు. పారిస్ బయలుదేరి వెళ్లనున్నారు. నేటి రాత్రి 7.30గంలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జగన్ దంపతులు పారిస్ బయలుదేరి వెళతారు. ఈ నెల 29వ తేదీన జగన్ దంపతులు పారిస్ చేరుకుంటారు.
పెద్ద కుమార్తె...
వచ్చే నెల 2వ తేదీన జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి కాన్వొకేషన్ లో జగన్ దంపతులు పాల్గొననున్నారు. పారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ఇన్సీన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జగన్ కుమార్తె యూనివర్సిటీ కాన్వొకేషన్ జరగనుంది. తిరిగి జులై 3వ తేదీన జగన్ దంపతులు పారిస్ నుంచి తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story