Tue Mar 17 2026 16:53:46 GMT+0530 (India Standard Time)
అమిత్ షాతో భేటీ అయిన జగన్
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు పలు అంశాలపై అమిత్ షాతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరంతో పాటు విభజన హామీలు, మూడు రాజధానులు వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.
రెండు రాష్ట్రాల మధ్య..
విభజన హామీలతో పాటు పెండింగ్ అంశాలను కూడా జగన్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలని అమిత్ షా ను జగన్ కోరినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారని తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ ముగిసిన అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరి జగన్ తాడేపల్లికి చేరుకోనున్నారు
Next Story

