Tue Mar 17 2026 00:34:04 GMT+0530 (India Standard Time)
రాజధానిపై జగన్ కీలక కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో విశాఖ రాజధాని కాబోతుందని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో విశాఖ రాజధాని కాబోతుందని తెలిపారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతానని చెప్పారు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లో జరుగుతన్న గ్లోబల్ ఇన్వెస్టర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలున్నాయన్నారు. మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా నిలిచామని జగన్ తెలిపారు.
పెట్టుబడులు పెట్టే వారికి...
పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుందని జగన్ తెలిపారు. పెట్టుబడులదారులకు తమ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తుందని తెలిపారు. త్వరితగతిన అనుమతులు, అవసరమైన చోట స్థలం వంటి సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి తరలి రావాలని కోరారు. కాస్మోపాలిటన్ సిటీ విశాఖ పెట్టుబడులకు స్వర్గధామంగా జగన్ సమావేశంలో తెలిపారు.
Next Story

