Sat Mar 21 2026 01:45:38 GMT+0530 (India Standard Time)
కేబినెట్ లో కీలక కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జులైలో విశాఖకు తరలి వెళుతున్నామని మంత్రులకు చెప్పారు. జులై నుంచి విశాఖ నుంచే పాలన ఉంటుందని మంత్రులకు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలన్ని స్థానాలు వైసీపీయే గెలవాని మంత్రులను జగన్ ఆదేశించారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందుకు అనుగుణంగా ప్లాన్ ను రూపొందించుకోవాలన్నారు.
మంత్రులపై ఆగ్రహం...
ఎమ్మెల్సీలుగా గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదేనని జగన్ అన్నారు. దీంతో పాటు కొందరు మంత్రులు తన పనితీరు మార్చుకోవాలని కూడా సూచించారు. లేకుంటే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, మార్పులు తప్పవని, ఎన్నికల సమయంలో నిర్లక్ష్యం వహించిన మంత్రులపై వేటు తప్పదని జగన్ హెచ్చరించారని తెలిసింది. మంత్రులు ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని జగన్ ఆదేశించారు.
Next Story

