Wed Mar 25 2026 20:59:47 GMT+0530 (India Standard Time)
ఢిల్లీకి బయలుదేరిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరారు. జన్పథ్ లోని నివాసంలో ముఖ్యమంత్రి రాత్రి బస చేస్తారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ భేటీ కానున్నారు.
రాష్ట్ర అభివృద్ధి...
రాష్ట్ర అభివృద్ధి పనులపై ప్రధాని మోదీతో జగన్ చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విభజన హామీలను అమలు చేయాలని జగన్ మోదీని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయనున్నారు.
Next Story

