Sat Mar 07 2026 13:36:03 GMT+0530 (India Standard Time)
అవనిగడ్డకు బయలుదేరిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జిల్లా అవనిగడ్డకు బయలుదేరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా జిల్లా అవనిగడ్డకు బయలుదేరారు. ఆయన ఈరోజు 10.55 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 22 ఎ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు ముఖ్యమంత్రి జగన్ అందచేయనున్నారు.
రైతులకు...
ఎన్నాళ్ల నుంచే ఈ ఉన్న ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం 1.25 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ చేరుకుంటారు. జగన్ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story

