Wed Feb 08 2023 06:53:46 GMT+0000 (Coordinated Universal Time)
అంబులెన్స్ లకు జగన్ జెండా ఊపి
రెండో దశ పశువుల అంబులెన్స్ లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.

రెండో దశ పశువుల అంబులెన్స్ లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ 165 పశువుల అంబులెన్స్ లను ప్రారంభించారు. వీటిని జిల్లాలకు కేటాయించారు. పశువులకు వెంటనే వైద్యం అందించేందుకు ఈ అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు.
240 కోట్లతో...
మూగ జీవాలకు వెంటనే చికిత్స అందించేందుకు తొలి విడత అంబులెన్స్ లను జగన్ గతంలో ప్రారంభించారు. 240 కోట్ల రూపాయలు వెచ్చించి మొత్తం 340 అంబులెన్స్ లను పశువుల వైద్యం కోసమే ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్స్ లు గ్రామాల్లో పర్యటించి పశువులకు వైద్యం అందించనున్నారు.
Next Story